My Daily Strength

నా అనుదిన బలం గురించి!

నేడు ప్రపంచములో హింస, ద్వేషం, తీవ్రవాదం, యుద్ధాలు మొదలైనవి మనము చూస్తున్నాము. కానీ, దేవుని బిడ్డవైన నీవు మాత్రమే ప్రపంచ దృష్టాంతములో సాక్షిగాను, దైవీక సమాధానముగా నిలువబడగలవు. కారణము, మన దేవుడు సమాధానమునకు కర్తగాను, యెహోవా షాలోము, మాత్రమే ఈ సమాధానమును మీకనుగ్రహించగలడు. మీ చేతిలో ఉన్న ఈ " అనుదిన బైబిల్ కంపానియన్'' పుస్తకములో ముద్రించబడిన ప్రతి పదము పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడినదని ఇందుకు ఆధారముగా ఉన్నది. ' యెహోవా షాలోం,' ' సమాధానమునకు ప్రభువు' మీకు శాంతినిచ్చి, సంతృప్తి ప్రోత్సహము ద్వారా మిమ్మును ఆశీర్వదించుచున్నాడు.

శాతాబ్ధపు ప్రవక్తయైన కీర్తిశేషులు రెవ. డాక్టర్. జాన్ జోసప్ (1953-2007), దేవుడు తనకు ఎన్నో విషయాలను వెల్లడించబోతున్నాడని గ్రహించి, ఈ అనుదిన బైబిల్ అధ్యయన దైవిక పుస్తకమును విశ్వసించిన ప్రతిఒక్కరికి సహాయపడు రీతిగా, తనకు కలిగిన దర్శనము

ప్రకారము ఈ పవిత్ర పుస్తకమును ముద్రించడము జరిగినది. దేవుని కోసం ఒక పవిత్ర స్థలాన్ని నిర్మించడానికి సాలొమోను రాజు తన తండ్రియైన దావీదు యొక్క కోరికను నెరవేర్చినట్లుగా, రెవ. డాక్టర్. జె. శామ్యేల్ సుధాకర్‌గారు, తన యొక్క ఆధ్యాత్మిక సహోదరుడైన రెవ. డాక్టర్. జాన్ జోసప్ గారి యొక్క కోరికను నెరవేర్చాడు. దేవుని రాజ్య విస్తరణ కల్పించుటకు ఎంతో భారము కలిగి ఉన్న వారి కొరకు సెప్టెంబరు 2007వ సంవత్సరము మొట్టమొదటగా ఈ పుస్తకము ముద్రించబడినది. జనవరి 2008స సంవత్సరమున వార్షిక ఎడిషన్‌గా ప్రారంభించబడినది. దేవుని నామము మహిమార్థమై మరియు ఆయన ఉన్నతమైన నామము ద్వారా, ఈ పుస్తకమును ముద్రించబడి ఈ సంవత్సరము 8 వ సంవత్సరపు వార్షికాన్ని జరుపుకుంటుంది.

ఈ అనుదిన ధ్యాన పుసక్తమునకు, " నా అనుదిన బలం '' అని మరి యొక పేరు పెట్టబడినది. ఈ పుస్తకమును ప్రతిరోజు చదువు పాఠకులకు ప్రభువు యొద్దనుండి నూతన బలమును పొందుకొనుటకు ఈ పుసక్తమును వెలువరించాము. ఈ అనుదిన ధ్యానపుసక్తము ఆంగ్లములోను మరియు తమిళములోను మొట్టమొదట ముద్రించబడినది. ఇతర భాషల పాఠకులు ప్రయోజనము పొందటానికి సంవత్సరము వెంబడి సంవత్సరము ఈ పుస్తకమును వెలువడనట్లు చేయుచున్నాము. అదియుగాక, ఇతర ప్రాంతీయ భాషలలోనికి, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, మరియు ఒరియా భాషలలోకి అనువదించబడుచున్నది. ఇది ఎవరి యొక్క వ్యక్తిగతమైన పేరు ప్రఖ్యాతులు కొరకు కాదు. కానీ, ఇది సంపూర్ణమైన దేవుని యొక్క ఆజ్ఞ ద్వారా అమలుచేయబడినది.

ఈ పుస్తకము యొక్క ప్రతి పేజిలోను ఆ దినమునకు కావలసిన బైబిల్‌లోని లేఖన భాగమును, మరియు ఒక కీలక వచనము, ఒక సందేశము ద్వారా బైబిల్ పఠనమును ఒక సంవత్సరములోనే బైబిల్‌ను ముగించుట కొరకు వివరించబడియున్నది. అదియుగాక, ఒక చిన్న ప్రార్థన మరియు ఆ దినముకొరకైన సందేశమునకు సంబంధించి ప్రేరేపించబడిన లోతైన సత్యాలు, తెలియజేయుట కొరకు ఈ సందేశము పొందుపరచబడియుంటుంది. ఈ పుసక్తమును చదివే ప్రతి పాఠకులు దేవునికి దగ్గర అగుటకును మరియు రక్షకుని నుండి దీవెనలు పొందుటకు సహాయపడుతుంది.

ప్రతిరోజు ఈ పుస్తకములో రచించినబడిన సందేశమును చదువుటకు మీరు ఏ ఒక్కరోజును కూడ తప్పిపోకండి. ఈ పుసక్తములోని ప్రతి మాట దేవుడు మీతో వ్యక్తిగతంగా మాట్లాడునట్లుగాను మరియు దేవునికి దగ్గర అగుటకు మీకు సహాయపడుతుంది.

మీరు దేవునికి సాక్ష్యముగా ఉండునట్లుగా ఈ పుసక్తము మీ చేతిలోనికి వచ్చి చేరునప్పుడు సాక్షిలేని మీ జీవితము సాక్షికరమైన జీవితానికి సహాయపడుటకు మీరు ఉపవాసముతోను మరియు ప్రార్థనలతోను అందుకొనండి. మరియు మీ బంధువులకు మరియు మీ స్నేహితులకు ఈ పుసక్తమును అందజేసి, వారు దీవెనలు పొందుకొనుటకు వారికి మీరు సహాయపడండి.

మీరు దీవెనలు పొందుకొన్నారని మీ ద్వారా మేము వినడానికి ఎంతో మిమ్మును ప్రోత్సహించుచున్నాము.

Copyright © My Daily Strength